మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గుట్టుచప్పుడు కాకుండా ఐదేళ్ల నుంచి రిలేషన్ లో ఉండి సడన్గా జూన్ నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం వరుణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లేదా వీరి ప్రేమ చిగురించిన ఇటలీలో కానుందని సమాచారం. అయితే ముందు మెగా ఫ్యామిలీ లావణ్య- వరుణ్ వివాహానికి అసలు ఒప్పుకోలేదట.
నాగబాబు ఇండస్ట్రీలోని హీరోయిన్లను కోడలుగా తెచ్చుకోవడానికి ఇష్టపడే వాడు కాదట. కానీ నిహారిక పట్టుపట్టి మరి వీరిద్దరి పెళ్లికి ఒప్పించిందట. ఇక నిహారిక నాగబాబు గారాల పట్టి కాబట్టి నాగబాబు కూడా ఒప్పేసుకున్నాడట. లావణ్య తనికి ముందు నుంచే ఫ్రెండ్ కావడంతో నిహారిక కి తన వదినగా వస్తే చాలా బాగుంటుందని ఆలోచించి నిహారిక నాగబాబుని ఒప్పించింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.