దుల్కర్ సల్మాన్ హీరోగా, రితిక సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనిత సురేంద్రన్ కీ రోల్ప్ ప్లే చేస్తున్న మూవీ కింగ్ ఆఫ్ కోత. అభిలాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో దగ్గుపాటి రానా, నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రానా దుల్కర్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
దుల్కర్ సల్మాన్ చాలా సునుత మనస్కుడని.. అతడు తెలుగులో సినిమాలో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వివరించాడు రానా. దుల్కర్ సల్మాన్ గురించి చెప్పాలంటే నా జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాలి దుల్కర్ హిందీ సినిమాలో నటిస్తున్న టైంలో ఆ మూవీ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ ఏ కావడంతో లొకేషన్ కు వెళ్లాను ఆ మూవీలో బాలీవుడ్ నటి హీరోయిన్గా నటిస్తుంది.. ఆమె షూటింగ్ టేక్ జరుగుతున్న టైంలో వాళ్ల భర్తతో ఫోన్ మాట్లాడుతుంది అది అర్జెంట్ విషయం కూడా కాదు అంటు వివరించాడు.
లండన్‌లో షాపింగ్ చేస్తున్న ఆయన భర్తతో ఆ షాపింగ్ గురించి ఆమె మాట్లాడుతూ డైలాగ్ సరిగ్గా చెప్పకుండా టేక్స్ మీద టెక్స్ట్ తీసుకుంటుందని దుల్కర్ మాత్రం కోపం తెచ్చుకోకుండా చాలా ఓపిక చూస్తున్నాడని రానా వివరించాడు. ఆమె తీరుకు నాకు మాత్రం చాలా కోపం వచ్చిందని.. దీంతో బాటిల్ పగలకొట్టేసానని వివరించాడు రానా. హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత నిర్మాతలను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టేసానని. దుల్కర్ మాత్రం సహనంతో ఓపికగా ఉన్నాడని అతడి వ్యక్తిత్వం అలాంటిది అంటూ వివరించాడు రానా.