మీ పెదాలు అందంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు…!

ఏ సమస్యనైనా దాచడం సాధధ్యమేమోగానీ… పెదవులకు వచ్చే సమస్యలు బయటకు కనిపిస్తాయి. అనారోగ్యానికి గురవడంతోపాటు అందం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా సెల్ఫ్ ఎస్టిమేట్ కూడా తగ్గుతుంది. అందుకే పెద్దవుల‌ ఆరోగ్యం కాపాడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

• అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.

• సిగరెట్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవాలి. దీనివల్ల నల్లగా, బండగ మారుతారు. అలాగే మహిళల్లో లిప్స్టిక్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందులో ప్రొఫైల్ గ్యాలేట్ అని రసాయనం పదార్థం ఉంటుంది. దీనివల్లనే ప్రధానంగా అలర్జీలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లిప్స్టిక్ వాడేవారు అది తమ శరీరానికి పడుతుందా లేదా అనే విషయాన్ని పడుతుంది అని తెలిస్తే తక్కువగా వాడటం మంచిది. పడడం లేదు అని తెలిస్తే పూర్తిగా మానేయడం చాలా ఉత్తమం.

• కొన్ని టూత్ పేస్ట్‌ల వ‌ల్ల కూడా మనకు పెదవులపై దురద వస్తు ఉంటుంది. అలాంటప్పుడు వాటిని ఉపయోగించకపోవడం మంచిది.

• నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. పెదవులు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే నాలుకతో తడవకూడదు.