నాగ చైతన్య ‘NC 22 ‘సినిమాలో ‘వంటలక్క’

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి యువ నటుడు నాగ చైతన్య ఒక ద్విభాషా చిత్రం కోసం వర్కింగ్ టైటిల్ NC 22 అని పేరు పెట్టారు.ఇప్పుడు ఈ సినిమాలో ప్రముఖ సీరియల్ నటి కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. ‘వంటలక్క ’గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ కేరళ కుట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

ఇది తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ప్రియమణి, వెన్నెల కిషోర్, ప్రేమి అమరెన్ మరియు సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ఈరోజు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Tags: Naga Chaitanya, Naga Chaitanya NC 22 movie, Premgi Amaren, priyamani, Sampath Raj, serial actress Premi Viswanath, Tamil director Venkat Prabhu, Vennela Kishore