సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఉదయం నుంచి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటించనున్నాడు.
పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం నుండి సాయి ధరమ్ తేజ్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ అగ్ని జ్వాలతో కూడిన ఒక కాగడాని పట్టుకుని ఒక గుంపును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పోస్టర్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే స్నీక్ పీక్ తో టైటిల్ రివీల్ చేస్తారని కూడా అంటున్నారు.
వర్కింగ్ టైటిల్ SDT15 అని పెట్టగా, సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.