టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన తొలి పాన్-ఇండియన్ మూవీ మైఖేల్‌తో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, మైఖేల్ టీజర్‌ను అక్టోబర్ 20, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దానిని మేకర్స్ సరికొత్త రొమాంటిక్ పోస్టర్ తో ప్రకటించారు .
రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సందీప్ కిషన్‌కి దివ్యాంశ కౌశిక్ ప్రేమికురాలిగా నటించగా. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సహకారంతో సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు. అంతేకాకుండా అతి త్వరలో విడుదల తేదీని కూడా వెల్లడికానుంది.