వంశీకి దిమ్మ‌తిరిగే బొమ్మ చూపించ‌బోతోన్న లోకేష్‌… అస్త్రాలు రెడీ…!

గత ఎన్నికలలో టిడిపి తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా ఎదిగి.. ఆ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లోకేష్ దిమ్మతిరిగేలా బొమ్మ చూపించబోతున్నారా ? అంటే అవుననే తెలుస్తోంది. లోకేష్ యువ‌గళం పాదయాత్ర త్వరలోనే కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ప్రస్తుతం మంగళగిరి శివారులో సాగుతున్న ఈ పాదయాత్ర ప్రకాశం బ్యారేజీ మీదగా కనకదుర్గ వారధిపై నుంచి విజయవాడ బార్డర్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

అనంతరం విజయవాడ పార్లమెంటు పరిధిలోని తూర్పు – సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా గన్నవరం నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టనుంది. వచ్చే సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంత కీలకమో.. గన్నవరంలో వల్లభనేని వంశీని చిత్తుగా ఓడించడం కూడా ఆ పార్టీకి అంతే కీలకం కానుంది. గుడివాడలో కొడాలి నానిని ఎలాగైతే ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణులు కసితో రగిలిపోతున్నాయో.. గన్నవరంలో వంశీని కూడా అంతే చిత్తుగా ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి క్యాడ‌ర్ తో పాటు టిడిపి కీలక నేత‌లు అందరు కసితో ఉన్నారు.

టిడిపికి దూరమయ్యాక వంశీ వైసీపీకి వెన్నుదన్నుగా ఉండడంతో పాటు చంద్రబాబు, లోకేష్ చివరకు ఆయన కుటుంబ సభ్యులపై ఎంతో దారుణమైన విమర్శలు చేశారు. సభ్య సమాజం ఇలా తలదించుకునేలా ఎలా ? మాట్లాడారో చూసాం. తర్వాత వంశీ తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరినా వంశీని మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కేడ‌ర్ అస్స‌లు క్ష‌మించే పరిస్థితి లేదు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వంశీని ఎలాగైనా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న లోకేష్ యువగ‌ళం పాదయాత్రలో తన అస్త శాస్త్రాలు ఉపయోగించి వంశీకి బలమైన కామెంట్లతో పంచులు విసిరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో గన్నవరంలో టిడిపి నుంచి ఎవరు ? పోటీ చేస్తారన్నదారిపై లోకేష్ పరోక్షంగా హింట్‌ ఇస్తారంటున్నారు.

అభ్య‌ర్థి ఎవ‌రు అన్న‌ది డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా వంశీని చిత్తుగా ఓడించి అసెంబ్లీలో లేకుండా చేసే అభ్యర్థినే ఇక్కడ పోటీకి పెట్టబోతున్నామని కూడా లోకేష్ సంకేతాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వంశీ అవినీతి, అక్ర‌మాలు, అర‌చ‌కాల‌పై కూడా లోకేష్ గురి పెట్ట‌నున్నార‌ట‌. విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం గత ఎన్నికలలో వైసిపి నుంచి వంశీ పై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు త్వరలోనే టిడిపి తీర్థం పుచ్చుకుని.. ఆయనే వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో వంశీ పై టిడిపి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది