కావ్య ని ఇంట్లో నుంచి గెంటేసిన రాజ్….. అపర్ణకు చూపించిన రుద్రాణి….!!

రాజ్ మట్టి తొక్కుతున్న వీడియోని ఓ న్యూస్ ఛానల్ వాడు డెలిక్యాస్ట్ చేశాడు. రాహుల్ అది చూసి మీడియాలో వచ్చేటట్టు చూడు అని చెబుతాడు. రుద్రాణి వెళ్లి అపర్ణ కి చూపిస్తుంది. రాజ్ అంతరాత్మ వచ్చి ఇందాక అక్కడేంటి మట్టి తొక్కుతూ రొమాన్స్ చేస్తున్నావు అని అడుగుతాడు. రాజ్ నీకు మట్టిలో కూడా రొమాన్స్ కనిపిస్తుందా అని అడుగుతాడు. కావ్యని రాజ్ మా అమ్మని పట్టుకుని ఇన్ని మాటలు అంటావా నువ్వెంత నీ స్థాయి ఎంత నీకు ఈ ఇంట్లో స్థానమే లేదు అని కావ్యని బయటికి గెంటేస్తాడు రాజ్.

కావ్య నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని గుమ్మం ముందే నుంచుని ఉంటుంది. కళ్యాణ్ రాజ్ దగ్గరికి వెళ్లి కట్టుకున్న భార్యని బయటకి గెంటేయడం తప్పు అని చెబుతాడు. ఇంటి బయట నిలబడమని నేను చెప్పలేదు అని రాజ్ అంటాడు. కావ్య వర్షంలో తడుస్తూ అలానే నించుంటుంది. కనకం వాళ్లకి ఫోన్ చేసి చెప్తే వాళ్లు వస్తూ ఉంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.