ఏపీలో గత ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యింది. జగన్ గాలిని ఎదుర్కొని గెలిచిన ఈ ఎమ్మెల్యేలనుఇబ్బంది పెట్టేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే సాధారణ ఎన్నికలకు 9 నెలల సమయం ఉన్న వేళ టీడీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మరింత స్ట్రాంగ్ అయ్యారు. అసలు వచ్చే ఎన్నికలలో వీరిని ఓడించడం జగన్ తరం కానే కాదని చెప్పాలి.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు.. మరొకరు ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. ఇక మండపేటలో జోగుళ్ల జోరుకు బ్రేకులు వేయడం జగన్ తరం కావట్లేదు. గత ఎన్నికల్లో ఓడిన రాజ్యసభ సభ్యుడు పిల్లి బోస్ ప్లేస్‌లో రామచంద్రాపురం నుంచి తోట త్రిమూర్తులును తీసుకువచ్చి ఇక్కడ ఇన్ చార్జ్ పగ్గాలు ఇచ్చినా వైసీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగడం లేదు.
ఇక ఎమ్మెల్యే జోగుళ్ల 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుతో వరుసగా 4వ గెలుపు తన ఖాతాలో వేసుకోనున్నారు. బాబు తాజా టూర్ తో మండపేటలో టిడిపి బలం ఏ రేంజ్‌లో ఉందో తేలిపోయింది. ఇక గొట్టిపాటి రవిని ఢీకొట్టడం ఇప్పట్లో ఎవడి తరం అయ్యేలా లేదు. అంత బలంగా రవి ఉన్నారు.
2004లో మార్టూరులో గెలిచిన రవి తర్వాత 2009 – 2014- 2019 ఎన్నికల్లో వరుసగా అద్దంకి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన రవికుమార్‌పై సరైన ప్రత్యర్థి లేక జగన్ సైతం తత్తరబిత్తర పడుతోన్న పరిస్థితి. అసలు లోకేష్ యువగళం రాష్ట్ర స్థాయిలోనే అద్దంకిలో దుమ్ములేపింది. యువగళం అద్దంకిలో నభూతోః నభవిష్యత్ అన్నట్టుగా జరిగింది.
రవికుమార్ మీద ఎవరిని పోటీ పెట్టాలో తెలియక వైసీపీ పెద్దలు ఓ 10 పేర్ల వరకు లిస్ట్ పెట్టుకుని.. వీళ్లు కాదు.. కాదు కాదు ఈ పేరు అని బుర్రలు పీక్కొంటున్నారు. ఏదేమైనా రవి అద్దంకిలో ఐదో విజయానికి రెడీ అయిపోతున్నారు.