Ananya Nagalla : బర్త్ డే పార్టీలో వకీల్ సాబ్ బ్యూటీ రచ్చ.. చేతిలో షాంపేన్ బాటిల్ తో హంగామా..!

Vakeel Saab Ananya Nagalla Birthday Party

అంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని తెలుగు అమ్మాయి అనన్యా నాగల్ల (Ananya Nagalla ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించే సరికి కావాల్సిన క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో తనకంటూ ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు సినిమాలతో సంబంధం లేకుండా సూపర్ బజ్ ఏర్పరచుకుంటుంది. ఈ క్రమంలో తన ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ని అలరిస్తుంది అనన్యా నాగళ్ల.

లేటెస్ట్ గా అమ్మడు తన బర్త్ డే పార్టీ చేసుకుంది. షిప్ లో బర్త్ డే పార్టీ చేసుకుంది అనన్యా. తన టీం అందరితో కలిసి షిప్ లోనే బర్త్ డే కేక్ కట్ చేసింది. అంతేకాదు తర్వాత పార్టీ కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. చేతిలో షాంపేన్ బాటిల్ తో అనన్యా రచ్చ చేసింది. తెలుగు అమ్మాయి అయినా కూడా ట్రెండ్ ఫాలో అవుతున్న ఈ అమ్మడికి సినిమాల్లో సరైన ఛాన్స్ రావట్లేదని చెప్పాలి.

ఈమధ్య హాట్ షోతో తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ వస్తున్న అనన్యా నాగళ్ల (Ananya Nagalla ) మంచి ఛాన్స్ వస్తే తానేంటో ప్రూవ్ చేస్తానని అంటుంది. సినిమాలు ఉన్నా లేకపోయినా సరే అమ్మడు తన ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక బర్త్ డే పార్టీలో అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది.

Tags: Ananya Birthday, Ananya Heroine, Ananya Nagalla, Mallesham, Pawan kalyan, PSPK, Tollywood, Vakeel Saab