Liger : గ్రాడ్యుయేట్ చాయ్ వాలా దగ్గర లైగర్.. విజయ్ ప్రమోషన్స్ లెక్క వేరబ్బా..!

Vijay Liger Promotions at Graduate Chai Wali Patna Puri Jagannath

ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ కి వచ్చి ఆడియెన్స్ సినిమా చూడాలి అంటే సినిమాని భారీగా ప్రమోట్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే సినిమా మీద ఆడియెన్స్ కి ఒక ఎక్సయిట్ మెంట్ ఏర్పడుతుంది. ఈమధ్య పెద్ద చిన్నా అనే తేడా లేకుండా అందరు హీరోలు తము చేసిన సినిమా రిలీజ్ టైం లో భారీగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. అలా చేయడం వల్ల సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న లైగర్ సినిమాకు కూడా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.

ఇప్పటికే నేషనల్ మీడియాలో లైగర్ ట్రెండీగా ఉండగా అది మరింత పెంచేందుకు లైగర్ (Liger) ప్రమోషన్స్ చేస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా పాట్నాలోని గ్రాడ్యుయెట్ చాయ్ వాలి తో ముచ్చటించారు. అక్కడ వారంతా విజయ్ తో సెల్ఫీలు తీసుకున్నారు. అక్కడ స్పెషల్ చాయ్ తాగారు విజయ్. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గ్రాడ్యుయెట్ చాయ్ వాలితో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.

పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన లైగర్ (Liger) సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతుంది. సినిమాలో విజయ్ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Tags: ananya pandey, Gradute Chai Wali, liger, Liger Promotions, Patna, puri jagannath, vijay, Vijay Devarakonda