బండ్ల గణేష్.. ఈ పేరు వింటే చాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని తన దేవుడంటూ దేవర అంటూ పొగిడేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కార్యక్రమాలు, సోషల్ మీడియా వేదికగా నిత్యం పవన్ నామస్మరణ చేస్తుంటాడు బండ్ల గణేష్. దీంతో బండ్ల గణేష్(Bandla Ganesh) కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా ఫాలోయింగ్ బాగా పెరిగింది.
సినీ ఇండస్ట్రీలో చిన్నా చితకా వేషాలు వేసుకునే బండ్ల గణేష్ ను తొలిసారి నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పవన్ కళ్యాణ్. వీరి కాంబినేషన్ లో మొదటగా వచ్చిన తీన్ మార్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ రికార్డ్ లు తిరగరాసింది. ఆ సినిమాతోనే బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ నిర్మాత అంటూ పేరు తెచ్చుకున్నాడు. అయితే గబ్బర్ సింగ్ సినిమా వచ్చి 11 ఏళ్లు దాటినా బండ్ల గణేష్ తో మరో సినిమా చేయలేదు పవన్ కళ్యాణ్. బండ్ల గణేష్ మాత్రం పవన్ తో సినిమా చేసేందుకు ఆయన చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. అయినా దేవర మాత్రం కరుణ చూపడం లేదు.
నా దైవ సమానులైన మా @PawanKalyan మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్ 🙏 pic.twitter.com/OtHMCRIHl1
— BANDLA GANESH. (@ganeshbandla) August 6, 2022
తన దేవుడి దృష్టి తనపై పడేలా ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్(Bandla Ganesh) అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తుంటాడు. తాజాగా బండ్ల గణేష్ మరోసారి పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ట్వీట్స్ పోస్ట్ చేశాడు. ‘ నా దైవ సమానులైన పవన్ కళ్యాణ్. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే ‘ అంటూ ట్వీట్స్ చేశారు.
బండ్లన్న చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ మరోసారి పవన్ ను కాకా పడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొందరు ఫ్యాన్స్ హ్యాట్రిక్ మూవీ గా వచ్చే సినిమా గబ్బర్ సింగ్ ను నుంచి ఉండాలని కోరుతుండగా, మరికొందరు మాత్రం దయచేసి తీన్ మార్ లాంటి సినిమా తీయవద్దని సెటైర్స్ వేస్తున్నారు. పవన్ ని దైవం అంటావు. కానీ పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేసినప్పుడు మాత్రం నువ్వెందుకు ఖండించవంటూ.. కొందరు బండ్లన్నను నిలదీశారు. పవన్ కళ్యాణ్ కరుణించేదెప్పుడో బండ్లన్న భజన ఆగేదెప్పుడో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే @PawanKalyan 🔥🔥🔥🔥 pic.twitter.com/G4YcSUHTQE
— BANDLA GANESH. (@ganeshbandla) August 6, 2022