వైష్ణవ్ తేజ్ హీరోగా కెతిక శర్మ ఫీమేల్ లీడ్ గా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేసిన గిరీశయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే పక్క పక్కనే ఉండే హీరో (Vaishnav Tej) హీరోయిన్ Kethika Sharma చిన్నప్పటి ఓ గొడవ వల్ల మాట్లాడుకోరు మాట్లాడుకోరు కానీ ఒకరికోసం ఒకరు పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన కథే ఈ రంగ రంగ వైభవంగా సినిమా స్టోరీ.
వైష్ణవ్ తేజ్, కెతికల జోడీ బాగుంది. అయితే ఇలాంటి కథలు ఇదివరకు మనం చాలా చూశాం. అయితే గిరీశయ్య ఈ కథని ఎలా నడిపించాడు అన్న దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తన సెకండ్ సినిమా కొండపొలంతో ఫ్లాప్ అందుకున్నాడు. మరి థర్డ్ మూవీగా వస్తున్న ఈ సినిమాతో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.