నాచురల్ స్టార్ నాని కూడా ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చేస్తున్నాడు. ప్రముఖ శీతల పానీయం స్ప్రైట్ కి ప్రస్తుతం నాని (Nani) బ్రాండింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా నానితో ఈషా రెబ్బ తో కలిసి చేసిన స్ప్రైట్ యాడ్ ప్రసారమవుతుంది. ఈ యాడ్ లో నాని గుబురు గెడ్డంతో కనిపించాడు. ప్రస్తుతం నాని చేస్తున్న దసరా సినిమా లుక్ లోనే ఈ స్ప్రైట్ యాడ్ చేశాడు నాని.
ఇక ఈ యాడ్ కోసం నాని భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం స్ప్రైట్ యాడ్ కోసం నాని 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడట. నాని (Nani) కూడా ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఇలా యాడ్స్ చేసి సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు. స్టార్ హీరోలైన మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ భారీగా ఈ యాడ్స్ లో దూసుకెళ్తుంటే నాని మొదటిసారిగా స్ప్రైట్ యాడ్ చేశాడు.
నాని చేస్తున్న సినిమాల విషయానికి వస్తే దసరా సినిమా శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తుంది. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది. సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.