Vaishnav Tej : హీరోయిన్ తో రెయిన్ సాంగ్ ఉండాల్సిందే.. మెగా హీరో మాములోడు కాదండోయ్..!

మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తన సినిమా రంగ రంగ వైభవంగా సినిమాతో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో రొమాంటిక్ హీరోయిన్ కెతిక శర్మ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ అలితో సరదాగా ప్రోగ్రాం కి వచ్చాడు. ఇదిలాఉంటే వైష్ణవ్ తేజ్ సినిమాలో ఖచ్చితంగా హీరోయిన్ తో రెయిన్ సాంగ్ ఉండాల్సిందే.

స్వయంగా హీరోనే ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఉప్పెన సినిమాలో సముద్రం మధ్యలో జల జలపాతం నువ్వు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక కొండపొలం సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ తో కూడా ఒక రెయిన్ సాంగ్ చేశాడు. హీరోయిన్ తో రెయిన్ సాంగ్ ఉంటుంది ప్రతి సినిమాలో ఏంటి విషయం అంటే.. అది కావాలనే పెట్టిస్తున్నా అని చెప్పాడు వైష్ణవ్ తేజ్.

కుర్రాడు కూడా మాములోడు కాదండోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. Vaishnav Tej, కెతిక శర్మ జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని చెప్పొచ్చు.

Tags: Kethika Sharma, Kondapolam, RRV, Tollywood, Uppena, Vaishnav Tej