Surekha Vani : బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న సురేఖా వాణి.. కూతురికి కూడా..!

ముందు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో క్యారక్టర ఆర్టిస్ట్ గా మెప్పించిన సురేఖా వాణి (Surekha Vani) భర్త మరణంతో సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. కూతురు సుప్రీత తో ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక తన కూతురు తనని మరో పెళ్లి చేసుకోవమని అంటుందని అయితే ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదని అంటుంద్ది సురేఖా వాణి.

అయితే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని. అతను తనని బాగా అర్ధం చేసుకోవాలని.. తనకి డబ్బు బాగా ఉండాలని అంటుంది సురేఖా వాణి (Surekha Vani). మరి సురేఖా వాణి కోరుకునే బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడో చూడాలి. కూతురిని ఎలాగైనా హీరోయిన్ ని చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది సురేఖా వాణి. తను సినిమాలు మానేసి కూతురికి హీరోయిన్ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుంది.

సోషల్ మీడియాలో తల్లి కూతుళ్లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సుప్రీత షార్ట్ ఫిలంస్ చేస్తూ అలరిస్తుంది. ఆమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఎక్సయిటింగ్ గా ఉంది.

Tags: Supreetha, Surekha Vani, Surekha Vani Artist, Surekha Vani Updates, Tollywood