Vaishnav Tej : కెతిక శర్మతో ఓ రేంజ్ లో వైష్ణవ్ తేజ్ రొమాన్స్.. కొత్తగా లేదేంటి సాంగ్ రంగ రంగ వైభవంగా..!

వైష్ణవ్ తేజ్ హీరోగా గిరి శాయ డైరక్షన్ లో వస్తున్న సినిమా Vaishnav Tej రంగ రంగ వైభవంగా. సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కెతిక శర్మ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కెతిక తన హాట్ లుక్స్ తో అందరిని అలరిస్తుంది. ఇక రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా ఆమె అందాలు హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.

ముఖ్యంగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కొత్తగా లేదేంటి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో దేవి శ్రీ రొమాంటిక్ మ్యూజిక్ కి వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కెతికల రొమాన్స్ పీక్స్ లో ఉంది. అసలే హాట్ బ్యూటీ.. ఆపైన రొమాంటిక్ సాంగ్.. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ ఇద్దరు రెచ్చిపోయి మరి చేశారు. కెతిక శర్మకి తప్పకుండా ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి తమిళంలో ఆదిత్య వర్మగా తీసి హిట్ అందుకున్న డైరక్టర్ గిరి శాయ తెలుగులో చేసిన మొదటి సినిమా రంగ రంగ వైభవంగా.

ఈ సినిమా పై వైష్ణవ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమాలో వైష్ణవ్ తేజ్, కెతిక శర్మల జోడీ హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఉప్పెన సూపర్ హిట్ అయినా నెక్స్ట్ వచ్చిన కొండపొలం అంచనాలను అందుకోలేదు. అందుకే రంగ రంగ వైభవంగా సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

 

Tags: DSP, Kethika Sharma, Kottaga Ledenti Sing, Ranga Ranga Vaibhavanga Movie, RRV, Vaishnav Tej