NTR : ఎన్.టి.ఆర్ 30 హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లో మిక్కిలినేని సుధాకర్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి.. వస్తున్నాయి. అలియా భట్, దిశా పటాని, అనన్యా పాండే వీళ్లలో ఎవరో ఒకరు ఎన్.టి.ఆర్ తో జోడీ కడతారని వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తారక్ తో జత కడుతుందని చెప్పారు.

అయితే ఈ వార్తలపై స్పందించారు NTR 30 మేకర్స్. సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయలేదని. మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఎన్.టి.ఆర్ తో జతగా స్టార్ హీరోయిన్ నటిస్తుందని హింట్ ఇచ్చారు. వీళ్లెవరు కాకుంటే వీళ్లని మించే హీరోయిన్ ని ఎన్.టి.ఆర్ కోసం దించుతున్నారని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ 30వ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. సినిమా తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.

Tags: Janatha Garrage Combo, koratala siva, ntr, NTR 30, NTR RRR, RRR, RRR Movie