Bimbisara : బింబిసార 2లో లేడీ విలన్.. స్టార్ హీరోయిన్ తో చర్చలు..!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమా బింబిసార (Bimbisara). వశిష్ట డైరక్షన్ లో కొద్దిపాటి అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ పై సత్తా చాటింది. సినిమా కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ని లాభాల బాట పట్టించింది ఈ సినిమా. ఈ క్రమంలో బింబిసార 2 మీద మరింత అంచనాలు పెరిగాయి. వశిష్ట ఇప్పటికే బింబిసార 2 మీద వర్క్ మొదలు పెట్టారని తెలుస్తుంది.

బింబిసార 2 (Bimbisara) సీక్వల్ కథలా కాకుండా ప్రీక్వల్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ పార్ట్ 2లో లేడీ విలన్ ఉంటుందని తెలుస్తుంది. వెండితెర మీద లేడీ విలన్లకు డిమాండ్ ఎక్కువ. అయితే ఈమధ్య కాలంలో అంత పవర్ ఫుల్ లేడీ విలన్లు కనిపించడం లేదు. బింబిసార 2 లో లేడీ విలన్ పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారు.

బింబిసార సినిమాలో హీరోయిన్స్ ఒకిత మైనస్ అనిపించారు. అయితే పార్ట్ 2లో అలాంటి మిస్టేక్స్ కూడా జరుగకుండా చూస్తున్నారు. బింబిసార 2 బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ బింబిసార 2 కోసం మరింత రిస్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Tags: Bimbisara, Bimbisara 2, Kalyan Ram, Star Heroine, Tollywood, Vashistha