‘ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ‘ ఫ‌స్ట్ గ్లింప్స్… ఈ సారి పెర్పామెన్స్ బ‌ద్ద‌లే ( వీడియో)

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వ‌రుస సినిమాల ప‌రంప‌ర‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక‌టి. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడు. హ‌రీష్ శంక‌ర్ యేడాది కాలంగా నానుతూ వ‌స్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మైంది. గబ్బర్ సింగ్ తర్వాత… పవన్-హరీశ్ కాంబోలో వస్తున్న సినిమా కావ‌డంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి.

Director Harish Shankar who cheated Ustaad Bhagath Singh.. Pawan is not in  this poster.. Who is? | ustaad bhagath singh new movie poster in harish  shankar look

సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టు కాస్త ముందుగానే ఈ సినిమా గ్లింప్ల్ రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ చూస్తే చిన్న‌ షెడ్యూల్ మాత్రమే జరిగింది. అయితే పవన్ క్రేజ్ నేప‌థ్యంలో ఆ చిన్న షెడ్యూల్ నుంచి కొద్దిపాటి విజువ‌ల్స్‌తోనే గ్లింప్స్ క‌ట్ చేసి రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

Ustaad Bhagat Singh | Pawan Kalyan | Ustaad Bhagat Singh | Pawan Kalyan:  పేరు మారిన పవన్ కల్యాణ్ సినిమా | Harish Shankar | ABP Desam

త‌క్కువ ఫుటేజ్‌తో క‌ట్ చేసిన గ్లింప్స్ కావ‌డంతో మ‌రీ హైప్ తెచ్చేలా లేదు. సినిమాలో ప‌వ‌న్ పోలీస్‌గా క‌నిపిస్తున్నాడు. ఇక త‌న జ‌న‌సేన పార్టీ సింబ‌ల్ అయిన గాజుగ్లాసుతో టీ తాగుతూ క‌నిపించాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం కూడా మ‌రీ గొప్ప‌గా అయితే అనిపించ‌లేదు. జ‌స్ట్ ఓకే.

Ustaad Bhagat Singh (@UBSTheFilm) / Twitter

నేప‌థ్యంలో భ‌గ‌వ‌ద్గీత‌లోని ఓ శ్లోకం వినిపిస్తూ ఉంటుంది. దీంతో టీజ‌ర్ గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. చివ‌ర్లో ప‌వ‌న్ చెప్పిన ఈ సారి పెర్పామెన్స్ బ‌ద్ద‌లైపోద్ది అన్న డైలాగ్ ఫినిషింగ్ ట‌చ్‌గా అదిరిపోయింది.