మ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌దులుకున్న సాయిప‌ల్ల‌వి… ఆ సినిమా ఏదో తెలుసా…!

2017లో ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. ఈ సినిమాలో న్యాచురల్ లుక్ తో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతోమందిని మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సాయి ప‌ల్ల‌వికి ఆ తర్వాత నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నటించింది. అయితే అందరూ హీరోయిన్స్ లాగా కాకుండా మేకప్, హాట్ ఫోటో షూట్ లకు దూరంగా ఉంటుంది సాయి పల్లవి.

Sarileru Neekevvaru Movie Posters | Mahesh Babu | Photo 1 of 3

అయితే ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నిటిలో ఆమె నటనకు ప్రాధాన్యత ఉంటేనే నటించింది. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇటీవలే గార్గి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది సాయి పల్లవి. ఇది తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో సాయి పల్లవికి మంచి గుర్తింపు వచ్చింది. కేవలం తన నటన, డ్యాన్స్ కి ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది సాయి పల్లవి. సాయి పల్లవి కొన్ని సినిమాల క‌థ‌లు, పాత్ర‌లు న‌చ్చ‌క రిజెక్ట్ చేసిందట.

Superstar Mahesh Babu looks Terrific in the new poster of Sarileru Neekevvaru

వాటిలో మహేష్ బాబు సినిమా కూడా ఒకటి. అయితే ఆ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా..? సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన రష్మిక నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఈ సినిమాతో విజయశాంతి చాలా సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది.

Sarileru Neekevvaru Movie Posters | Mahesh Babu | Photo 3 of 3

ఈ సినిమా దాదాపు 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే రు. 250 కోట్ల రేంజ్‌లో వసూళ్లను రాబట్టిందంటే ఏ రేంజ్‌లో సినిమా ఆడిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నారట. పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో.. హీరో ఆమెతో లవ్ లో పడేసే సన్నివేశాలు మరియు సాంగ్స్ కి మాత్రమే హీరోయిన్ పాత్ర ఉండడంతో సినిమాను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. తీరా రష్మిక ఈ సినిమా లో నటించి సినిమా సూపర్ హిట్ కావడంతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ర‌ష్మిక‌.