కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ త‌న ఫ్రెండ్ భ‌ర్త‌నే పెళ్లాడిందా… !

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లో ఒక సంచలనం. ఆమె 2014 ఎన్నికలలోనే అమేథిలో ఏకంగా రాహుల్ గాంధీపై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయిన కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇక మొన్న ఎన్నికలలో ఆమె అమేథిలో మరోసారి పోటీ చేసి రాహుల్ గాంధీ పై 70 వేల ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించి ఫైర్ బ్రాండ్ అయ్యారు.

రాహుల్ గాంధీపై ఎంపీగా విజయం సాధించడం ద్వారా ఆమె దేశ రాజకీయాల్లోనే ఒక పాపులర్ పర్సన్ అయ్యారు. అయితే స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు ఒక టీవీ నటి అన్న విషయం తెలిసిందే. ఆమె టీవీ సీరియల్ నటిగా బాగా పాపులర్. ఇక ఆమె ఫ్యామిలీ విషయానికి వస్తే ఆమె భర్త జుబిన్ ఇరానీ. వీరిద్దరి వివాహం 2001లో జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు జోర్‌ కూడా ఉన్నాడు. కూతురు పేరు జోష్.

అయితే స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీకి అంతకుముందే మొనాతో వివాహం జరిగింది. వారిద్దరికీ షానెల్లి అనే కుమార్తె ఉంది. అంటే జుబిన్ కు స్మృతి ఇరానీ రెండో భార్య. ఈ విషయంపై ఆమెకు తరచూ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. స్మృతి భర్త మొదటి భార్య మోనా స్మృతి స్నేహితురాలని సమాచారం. తన స్నేహితురాలి భర్తనే స్మృతి పెళ్లాడిందా ? అన్న ప్రశ్నలు ఆమెకు తరచూ ఎదురవుతూ ఉంటాయట.

దీనిపై తాజాగా మరోసారి ప్రశ్న ఎదురుగా స్మృతి కాస్త రుసురసలాడింది. మోనా తన కంటే 13 ఏళ్లు చిన్నదని.. తన చిన్ననాటి స్నేహితురాలు ఎలా ? అవుతుందని ప్రశ్నించింది. మోనా కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేనిది. ఒక అమాయక పౌరురాలని ఈ విషయంలోకి లాగకండి.. రాజకీయంగా ఏమి సంబంధంలేని మోనాతో పోరాడకండి.. ఆమె గౌరవానికి భంగం వాటిల్ల వద్దు అని స్మృతి చెప్పటం విశేషం.