Urvashi : ఊర్వశిని మూడో పెళ్లాం చేసుకోవాలని అనుకున్నాడట.. హాట్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానన్న నలుగురు పిల్లల తండ్రి..!

బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకి (Urvashi ) సూపర్ క్రేజ్ ఏర్పడింది. అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాట పడని ఈ అమ్మడు తన హాట్ షోతో బాలీవుడ్ ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఈమధ్యనే సౌత్ సినిమాలను కూడా చేస్తున్న అమ్మడికి ఓ వెరైటీ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. తమిళంలో ఈమధ్య వచ్చిన ది లెజెండ్ సినిమాలో ఊర్వశి నటించింది.

అరుల్ శరవణన్ హీరోగా తెరకెక్కిన ది లెజెండ్ సినిమాలో ఊర్వశి రౌతెలా (Urvashi ) నటించింది. ఈ సినిమాలో నటించినందుకు ఆమె 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పింది ఊర్వశి.

ఇంతకీ అదేంటి అంటే దుబాయ్ లో తనకు ఓ పాప్ సింగర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడని. అయితే ఆల్రెడీ అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని.. తనని 3వ భార్యగా చేసుకుంటానని అడిగాడని. అతనికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది ఊర్వశి. తనకు చాలా పెళ్లి ఆఫర్లు వస్తున్నాయని కాని తనకు నచ్చిన వాడు మాత్రం దొరకట్లేదని చెప్పింది ఊర్వశి.

Tags: Block Rose, Bollywood, The Legend, Tollywood, Urvashi Hot, Urvashi Rautela