Sudheer Babu : కృతి శెట్టి మరో సినిమా రిలీజ్ డేట్..!

సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అప్పుడెప్పుడో టీజర్ వదిలి ఆ తర్వాత సైలెంట్ అయిన చిత్రయూనిట్ లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ చేసింది. సెప్టెంబర్ 16న సుధీర్ బాబు (Sudheer Babu) ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఫిల్మ్ మేకర్ గా కనిపిస్తున్నాడు.

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమెకి బాగా స్కోప్ ఉన్న పాత్ర దొరికినట్టు అనిపిస్తుంది. ఉప్పెన హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. ఈ శుక్రవారం కూడా ఆమె నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజ్ అవుతుంది.

ఇక నెక్స్ట్ మంత్ ఎలాగు సుధీర్ బాబు సినిమా వస్తుంది. సినిమాలు నటించడమే కాదు రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా కృతి శెట్టి బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ విషయంలో ఆమెని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అని చెప్పొచ్చు. శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత సుధీర్ బాబు  (Sudheer Babu)చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కృతి శెట్టి ఉంది కాబట్టి సినిమాపై డబుల్ క్రేజ్ ఏర్పడింది.

 

 

Tags: AAMC, Indraganti Mohanakrishna, Krithi Shetty, Macharla Niyojakavargam, Sudheer Babu, Tollywood, Uppena