Vaishnav Tej : ఉప్పెనని చూసి వాత పెట్టుకుంటున్నారు..!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆ సినిమాకు కూడా బడ్జెట్ ఎక్కువే పెట్టారు. ఓ డెబ్యూ హీరో సినిమాకు పాతిక కోట్లు పెట్టి రిస్క్ చేశారు నిర్మాతలు. అయితే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చి భారీ వసూళ్లను రాబట్టింది. అయితే అన్ని సినిమాలు ఉప్పెనలు కావు కదా.. ఉప్పెన ఇచ్చిన జోష్ తో కొండపొలం సినిమా చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా ఫ్లాప్ గా మిలిగింది. అయితే ఉప్పెన క్రేజ్ తో ఆ సినిమాని భారీ రేటుకే అమ్మారు.

ఇక రీసెంట్ గా రంగ రంగ వైభవంగా సినిమా చేశాడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ). ఆ సినిమా కూడా 28 కోట్ల బిజినెస్ చేసిందట. అయితే సినిమా చూస్తే మాత్రం 10 కోట్లు కూడా రాబట్టలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఉప్పెన సినిమా చూసి వైష్ణవ్ తేజ్ కెపాసిటీని ఎక్కువ ఊహించేసుకున్నారని చెప్పొచ్చు. అన్ని సినిమాలు ఉప్పెనలు కావు కదా.

వైష్ణవ్ తేజ్, కెతిక శర్మ జంటగా గిరి శాయ డైరక్షన్ లో వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. సో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) ఖాతాలో మరో ఫ్లాప్ పడ్డది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించినా సినీమ సక్సెస్ అవలేదు. మరి ఇక మీదట వైష్ణవ్ తేజ్ కథల విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని చెప్పొచ్చు.

Tags: Kethika Sharma, Kondapolam, Ranga Ranga Vaibhavanga, RRV, Tollywood, Uppena, Vaishnav Tej