Balakrishna : ఆ సినిమా కోసం 10 రోజులు భోజనం చేయని బాలయ్య..!

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna ) సినిమా కోసం ఎంత డెడికేషన్ గా ఉంటారన్నది ఇదివరకు చాలా సందర్భాల్లో తెలిసిందే. కానీ లేటెస్ట్ గా సీనియర్ డైరక్టర్ సింగీతం శ్రీనివాస రావు తన మాటల్లో బాలయ్య గొప్పతనం గురించి చెప్పారు. లివింగ్ లెజెండ్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన సింగీతం శ్రీనివాస రావు ఇటీవల ఆలితో సరదాగా ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

భైరవ ద్వీపం సినిమా కోసం బాలయ్య బాబు (Balakrishna ) 10 రోజుల పాటు అన్నం తినలేదని. ఆ సినిమాలో కురూపి పాత్ర వేశధారణ కోసం చాలా ఎక్కువ సమయం పట్టేదని. తానొక స్టార్ హీరో అయినా కూడా ఆ పాత్ర వేయడానికి ఆయన అసలు ఆలోచించలేదని అన్నారు. అంతేకాదు ఆ పాత్ర కోసం 10 రోజుల పాటు భోజనం చేయలేదని. కేవలం జ్యూస్ ల మీదే ఉన్నారని చెప్పారు.

బాలయ్య డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాదు ప్రయోగాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు బాలయ్య బాబు. భైరవ ద్వీపం సినిమా చేస్తే ఆయనతోనే చేయాలని సింగీతం అనుకున్నారట. అలాంటి సినిమాలు వారి వల్లే అవుతుందని ఆయన వెళ్లడించారు.

Tags: balakrishna, Balayya Babu, Bhairava Dveepam, Nandamuri Family, NBK, ntr, Tollywood