సావిత్రిపై క‌క్ష క‌ట్టిన జెమినీ గ‌ణేషన్ చేసిన పిచ్చి ప‌ని ఇదే…!

మ‌హాన‌టి సావిత్రి జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమె జీవితం తెరిచిన పుస్త‌క‌మేన‌ని చెబుతారు. అయితే.. ఆమె జీవితం విషాదాంతంగా ముగియాల్సిందేనా? అస‌లు ఆమె ఇలాంటి జీవితాన్ని ఎప్పుడైనా ఊహించారా? అంటే.. లేద‌నే సమాధాన‌మే వ‌స్తుంది. ఎందుకంటే.. అంద‌రిలానే సావిత్రి కూడా చాలా పెద్ద పెద్ద క‌ల‌లే క‌న్నారు. అనేక రూపాల్లో త‌న ప్ర‌తిభ‌ను చాటుకోవాల‌ని భావించారు.

Savitri: Five films of the late actress that are a must watch

అయితే.. అనూహ్యంగా భ‌ర్త జెమినీ గ‌ణేశ‌న్ కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా సావిత్రి జీవితం గాడిత‌ప్పింద‌ని తెలిసిందే. సినిమా నిర్మాత‌గా.. ద‌ర్శ‌కురాలిగా మంచి ప్ర‌తిభ‌తో దూసుకుపోతున్న స‌మ‌యంలో దేశం గురించి ఆలోచించిన మ‌హాన‌టిగా సావిత్రి పేరు తెచ్చుకున్నారు. కేంద్ర సెన్సార్ బోర్డులో అనుస‌రిస్తున్న విధివిధానాల్లో ఇప్ప‌టికీ.. చాలా వ‌ర‌కు సావిత్రి రూపొందించిన‌వే ఉన్నాయంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

Savitri-Gemini Ganesan love story: Botched affair to the bottle

కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మ‌న్‌గా సావిత్రి వ్య‌వ‌హ‌రించిన విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. చేసిం ది మూడు మాసాలే అయినా.. బోర్డులో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే.. దేశ స్వాతంత్రం కోసం.. ఉద్య‌మించిన వారి జీవిత క‌థ‌ల ఆధారంగా.. సినిమా చేయాల‌ని అనుకున్నారు. దీనికి క‌థ కూడా రూపొందించుకున్నారు.

The sweet and sour real life romance of reel actors Savitri and Gemini | Daily FT

భారీ బ‌డ్జెట్ కూడా లెక్క‌పెట్టుకున్నారు. ఇది జెమినీ గ‌ణేశ‌న్‌కు న‌చ్చ‌లేదు. ఉన్న సంప‌ద అంతా ఆ సినిమాకు ఖ‌ర్చ‌యితే.. ఎలా అనుకున్నారు. ఈ వివాదం త‌ర్వాత కుటుంబ క‌ల‌హాలు చోటు చేసుకుని.. సావిత్రి రూటు మార్చేశాయి. అదే జ‌ర‌క‌పోయి ఉంటే.. దేశంలో అగ్ర‌ద‌ర్శ‌కురాలిగా సావిత్రి పేరు మార్మోగి ఉండేది. అదేవిధంగా అప్ప‌ట్లో జెమినీ గ‌ణేశ‌న్ చేతుల్లోనే డిస్ట్రిబ్యూట‌ర్లు ఉండేవారు.

Did Gemini Ganesan love actress Savitri at least 5%? - Quora

ఉద్దేశ పూర్వ‌కంగా.. సావిత్రి తీసిన చిన్నారి పాప‌లు సినిమాను కొన‌కుండా ఆయ‌నే చ‌క్రం అడ్డు వేశార‌ని అంటారు. ఇలా.. సావిత్రి ప్ర‌తిభ చాటుకోలేక పోయారు. అలా కాకుండా ఉండి ఉంటే.. అంత‌ర్జాతీయ స్తాయిలో స్పిల్ బ‌ర్గ్ స్థాయి మ‌న సావిత్రికి ద‌క్కి ఉండేద‌ని చెబుతారు.