సదా అంత పెద్ద పాపం చేసిందా..? కన్నీళ్లు పెట్టుకుంటూ ఓపెన్ అయిన హీరోయిన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్లతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన వాళ్ళలో సదా ఒకటి. ఆమె జయం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సదాకు ఆమె నటించిన‌ మొదటి సినిమా ద్వారానే ఫిలింఫేర్ అవార్డు దక్కడంతో ఆమెకు క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా తరువాత సదా జూనియర్ ఎన్టీఆర్, విక్రమ్ ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాలలో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

Sadha: కన్నీళ్లు పెట్టుకున్న సదా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..  అసలేం జరిగిందంటే.. - Telugu News | Actress Sadha Shares Emotional video  about her earthlings cafe telugu cinema ...

తర్వాత సదాకి సినిమా చాన్సులు తగ్గిపోవడంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. కాగా సదా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బుల్లితెరకు సంబంధించిన డాన్స్ షోలో కొంతకాలం జడ్జ్ గా మెరిసింది. అయితే ప్రస్తుతం బుల్లితెరకు వెండితెరకు దూరంగా ఉన్న స‌దా సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో సదా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది.

Sadha Archives - South Indian Actress

ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలో 23 ఏప్రిల్ 2019 నుంచి సదా ఎర్త్ లింక్స్ కేఫ్ అనే వెజ్ రెస్టారెంట్ ను రన్ చేస్తుంది. అయితే సదా ఆ వీడియోలో మాట్లాడుతూ తను నడుపుతున్న ఎర్త్ లింక్స్ కేఫ్ ఒక నెలలో మూసివేయాల్సి వచ్చింద‌ట‌. ఆమె పెట్టిన మొదటి వ్యాపారం అదేనని దానికోసం రోజుకు 12 గంటలు వర్క్ చేశానని చెప్పుకొచ్చింది. 23 ఏప్రిల్ 2023న సదాకు అ కేఫ్ కు సంబంధించిన ల్యాండ్ ఓనర్ కేఫ్ ను నెలలోపు ఖాళీ చేయాలనే నోటీసులు పంపించారని.. ఆ నోటీసులు చూసిన ఒక క్షణం తనకు ఏమీ అర్థం కాలేద‌ని కన్నీరు పెట్టుకుంది.

Tollywood actress sadaa gorgeous images | - Sadha, Actress Sadha, Mind Sadha, Sadafmohammed, Sadha Hot, Sadha Hot Pics, Sadha Spicy

ఆ కేఫ్ అంటే తనకు ఎంతో ఇష్టమని కరోనా టైం లో ఆ రెస్టారెంట్ రన్ అవ్వకపోయినా ప్రతి నెల కచ్చితంగా రెంట్ చెల్లించానని.. అయినా ఓనర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని.. ఆ కేఫ్ ను మరి కొంతకాలం ఉంచడానికి ఎంత బ్రతిమాలినా అతను తన మనసును మార్చుకోవడం లేదని బాధపడింది. దీంతో ఆమె నెలలోపు ఆ కేఫ్ ను కాళీ చేయబోతున్నానని ఎమోషనల్ అయింది.

பண்ணுனதெல்லாம் வீனா போச்சு! பேரிழப்பால்.. லைவில் கண்ணீர் விட்டு கதறிய நடிகை சதா! ஆறுதல் கூறிய ரசிகர்கள்.!

స‌దా ఎమోష‌న‌ల్ అవ్వ‌డం చూసిన కొంద‌రు నెటిజ‌న్లు ఆమెకు మద్దతుగా ఉండగా. మరికొంతమంది నెటిజన్స్ మాత్రం ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించడానికి తన తోటి హీరోయిన్ల ఛాన్సులు కూడా ఆమె లాగేసుకుందని.. దాంతో చాలామంది హీరోయిన్స్ అప్పట్లో ఫీడ్ అవుట్ అయిపోయారని.. అంత పెద్ద పాపం చేశావు కాబట్టే నీకు ఇప్పుడు ఇలా బాధపడాల్సిన పొజిషన్ వచ్చిందని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sadaa (@sadaa17)