చంద్ర‌బాబు వేసిన స్కెచ్‌తో ఉమ్మ‌డి అనంత‌పురం టీడీపీ క్లీన్‌స్వీప్‌…!

టిడిపి అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను గద్దె దింపాలన్న‌ కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే రకరకాల ప్రణాళికలతో నాలుగేళ్లలో పార్టీని విజయపు అంచుల వరకు తీసుకువచ్చేశారు. గత ఎన్నికలలో 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం ఈ స్థాయిలో పుంజుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఈసారి వైసీపీ కంచుకోట అయిన రాయలసీమను బద్దలు కొట్టేందుకు చంద్రబాబు సరికొత్త ప్లానింగ్ తో ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలలో పలు నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థులతో పాటు బలమైన అభ్యర్థులను.. సీనియర్లను.. కొన్ని నియోజకవర్గాలలో వారసులను రంగంలోకి దింపుతున్నారు. ఇక తాను కూడా ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు కూడా రాయలసీమలోనే ఉండటం విశేషం. ఒకటి ఆయన సొంత నియోజకవర్గ కుప్పం తో పాటు రెండోది అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కుప్పంలో భారీ మెజార్టీ టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కు అక్కడ బాధ్యతలు అప్పగించారు. ఇక కళ్యాణదుర్గంలో టిడిపికి ఎప్పుడు బలమైన ఓటింగ్ ఉంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం అంత టిడిపికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అందుకే ఈసారి చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లు – రెండు లోక్సభ సీట్లు స్వీట్ చేయవచ్చు అన్నదే ఆయన టార్గెట్ గా తెలుస్తోంది.

ఇక రెండు సీట్లలో గెలిచాక ఆయన కుప్పంను ఉంచుకుంటారా ? లేదా కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా ఉంటారా అన్నది తర్వాత సమీకరణలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే ఆ ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ డ్యాం షూర్‌గా సంచలన విజయాలు నమోదు చేసి వైసిపికి షాక్ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.