చిత్ర పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబినేషన్లు చూడడానికి బాగున్న ప్రాక్టికల్ గా అవి ఎంత ట్రై చేసిన వర్కౌట్ అవ్వువు.. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం చేతుల దాకా వచ్చి చేజారి పోతూ ఉంటాయి.. అలాంటి కాంబినేషన్లలో ఒకటి పవన్ కళ్యాణ్- సౌందర్య కాంబినేషన్.. పవన్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి చలామణి అవుతున్న రోజులవి ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా అప్పటికి ఆయనకేం క్రియేట్ అవలేదు. అప్పుడే కొత్తగా ఇండస్ట్రీ లోకి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత గోకులంలో సీత వంటి సినిమాల్లో మాత్రమే నటించిడు. అయినా మూడో సినిమా సుస్వాగతం.. పవన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం కూడా ఇదే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరి హృదయాలను కల్చివేసే విధంగా ఉంటుంది.. అంత ఎమోషనల్ గా ఈ సినిమాలో ఆయన ఎంతో పర్ఫెక్ట్ గా నటించాడు. మరి ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ నటన ఇప్పటికీ మర్చిపోలేం.
అదే విధంగా ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు జంటగా సీనియర్ హీరోయిన్ దెవయని నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె కంటే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సౌందర్యను తీసుకోవాలని అనుకున్నారట. కానీ అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట. అంత గొప్ప నటితో నటించే ధైర్యం నాకు లేదు.. ఆమె నటన ముందు నా నటన సరిపోదు తేలిపోతుంది. ఆమెకు బదులుగా వేరే హీరోయిన్‌ను తీసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలను కోరారట.
అయితే దర్శకుడు భీముని శ్రీనివాసరావు మాత్రం వెనక్కి తగ్గలేదు.. ఇలాంటి పాత్రలకు సౌందర్య అయితేనే న్యాయం చేయగలరని ఆమె వల్లే సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని పవన్ కళ్యాణ్ దగ్గర పట్టుపట్టారట. డైరెక్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకరించారట. కొన్ని రోజుల తర్వాత సౌందర్యన్ని కలిసి మీ డేట్స్ కావాలని అడగగా ఆమె అందుబాటులో లేవని సుస్వాగతం సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో సౌందర్య తర్వాత అదే తరహా క్యారెక్టర్లు చేస్తూ ఫ్యామిలీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ స్టార్ దేవయానిని తీసుకొని సుస్వాగతం సినిమాని తెరకెక్కించారు.
అప్పట్లో ఈ సినిమా కలక్షన్ల పరంగా భారీగా దుమ్ము లేపింది. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా ఐదు కోట్లకి పైగా భారీ కలక్షలను రాబట్టింది. ఆ సమయానికి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలక్షన్లు రాబట్టిన సినిమా కూడా ఇది. ఇప్పటికి పవన్ అభిమానులు ఈ సినిమా అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. మరి ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి ముందు పవన్ కళ్యాణ్ తండ్రి రఘువరన్ చనిపోయినప్పుడు వచ్చే ‘ఆలయాన హారతి లో.ఆఖరి చితిమంటలలో‘ అంటూ సాగేే పాటని ఏ సమయంలో చూసినా అందరికీ కన్నీళ్లు ఆగవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.