బాల‌య్య డైరెక్ట‌ర్‌తోనే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ ఫిక్స్‌… మాస్ మోత మోగాల్సిందే..!

ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న డబ్ల్యూ మూవీ ఏదైనా ఉంది అంటే అది నట‌సింహ బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ అని చెప్పాలి. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ పై ఐదారు సంవత్సరాలుగా ఎన్నో వార్తలు వినిపించినా అవేవీ నిజం కాలేదు. ఎట్టకేలకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం చ‌ర్చ‌లు అయితే మొదలయ్యాయి.

అటు నటనలో శిక్షణతో పాటు ఫైట్లు, డ్యాన్సుల్లో కూడా అమెరికాలో కోచింగ్ తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ అయితే పక్కాగా ఉండబోతుంది. బాలయ్య సైతం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ డైరెక్టర్ ఎవరు ? అన్నదానిపై ఇప్పటివరకు నెలకొన్న సస్పెన్స్ కు తెరపడినట్టు తెలుస్తోంది.

బాలయ్యతో సంక్రాంతికి వీరాసింహారెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా ఇచ్చిన మలినేని గోపీచంద్ మోక్షజ్ఞ డెబ్యు సినిమాకు దర్శకుడిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్‌గా మోక్షజ్ఞ, బాల‌య్య‌తో గోపీచంద్ చర్చలు కూడా జరిపాడు అని.. బాలయ్య సైతం గోపీచంద్ చెప్పిన డెబ్యూ స్టోరీకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఏదేమైనా వీర‌సింహారెడ్డి హిట్‌తో నంద‌మూరి అభిమానుల మ‌న‌స్సులు గెలుచుకున్న మ‌లినేని గోపీచంద్ మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీని ఎలా ప్ర‌జెంట్ చేస్తాడో ? చూడాలి. గోపీచంద్ సినిమాలు అంటేనే మాస్ మోత మోగిపోవాల్సిందే… మ‌రి మోక్ష‌జ్ఞ‌ను ఏ స్టైల్లో ప్ర‌జెంట్ చేస్తాడ‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే..!