చిరు- వెంకటేష్‌కే చుక్కలు చూపించిన ఉదయ్ కిరణ్.. ఏం జ‌రిగిందంటే..!

టాలీవుడ్ దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఉదయ్ మన మధ్య లేకపోయినప్పటికీ అతని సినిమాలు చూస్తే ఇప్పటికి మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, చిత్రం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి భారీ రికార్డులను క్రియేట్ చేసి అప్పటి స్టార్ హీరోలకు కూడా చెమటలు పట్టించాడు. ఈ రెండు సినిమాలు తర్వాత వచ్చిన వచ్చిన మూడో సినిమా మనసంతా నువ్వే.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని రికార్డులను కొల్లగొట్టింది.. ఇక ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో నటించే సమయంలోనే స్టార్ హీరోలైన చిరంజీవి- వెంకటేష్ వరుస ప్లాప్‌ల‌తో ఇబ్బంది పడుతున్నారు.

ఇక ఉదమ్ కిర‌ణ్‌ నటించిన మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయ్యే సమయంలోనే చిరంజీవి నటించిన డాడీ, వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వవు అని ఈ ఇద్దరు హీరోలు భావించారు. ఇక ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమా సెప్టెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేయడానికి నిర్మాత ఎమ్మెస్ రాజు ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాని రిలీజ్ చేస్తే చిరు- వెంకటేష్ నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించమని భావించిన ఈ స్టార్ హీరోలు ఉదయ్ కిరణ్ సినిమాని మా సినిమాలు రిలీజ్ చేశాక ఉదయ్ కిరణ్ సినిమాను రిలీజ్ చేయాలని ఇద్దరు హీరోలు నిర్మాత ఎమ్మెస్ రాజును కోరారట.

ఇక ఎమ్మెస్ రాజు కూడా అంత పెద్ద స్టార్ హీరోలు అడగటంతో చేసేదేమీ లేక మనసంతా నువ్వే సినిమాను వాయిదా వేసుకున్నారు. ఆ విధంగా డాడీ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకి నువ్వు నాకు నచ్చావ్ సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల రిలీజ్ అయిన రెండు వారాలకి ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయి బంపర్ హిట్ గా నిలిచింది. ఈ విధంగా ఉదయ్ కిరణ్ కెరీర్ మొదట్లోనే ఆయన క్రేజ్‌ను చూసి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం భయపడిపోయారట.