బ్లాక్‌బ‌స్ట‌ర్ శ్రీమంతుడు సినిమా వ‌దులుకున్న టాలీవుడ్ దురదృష్టవంతుడు ఎవరంటే..!

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమాల్లో శ్రీమంతుడు కూడా ఒకటి.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సంపత్ రాజ్‌ వంటి తదితరులు కీలకపాత్రలో నటించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాతోనే నిర్మాతలుగా అడుగుపెట్టారు. అదే విధంగా ఈ సినిమాకు మహేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు.

లవ్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా 2017 ఆగస్టు 7న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల‌ వర్షం కురిపించింది. మన తెలుగు రాష్ట్రాల్లో అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగ రాసిన చిత్రంగా నిలిచింది. ఊరు దత్తత అనే కాన్సెప్టుతో ఈ మూవీ కథ సాగుతుంది. గ్రామాల అభివృద్ధి రైతుల నేపథ్యం మాత్రమే కాకుండా అభిమానులకు నచ్చేలా లవ్ సీన్స్, ఫైట్ సీన్స్ కామెడీ టచ్ ఇచ్చి కొరటాల ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెర‌కిక్కించాడు.

ఈ సినిమాకు ముందు మహేష్ 1 నేన్నొక్కడినే, ఆగడు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్‌ల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి సమయంలోనే శ్రీమంతుడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన విజయ దాహాన్ని తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లోనే ఈ సినిమా రూ.85 కోట్ల పైగా భారీ క‌ల‌క్ష‌ణ‌ల‌ను రాబ‌ట్టి రూ.10 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.అయితే ఇక్కడ చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే శ్రీమంతుడు సినిమాకి మొదటి ఛాయిస్ మహేష్ కాదట.. ముందుగా ఈ సినిమాను కొరటాల శివ టాలీవుడ్ లో ఉన్న మరో స్టార్ హీరోకు చెప్పగా ఆయన నో చెప్పారట.

ఇంత‌కి నో చెప్పిన ఆ అన్ లక్కీ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పటికే శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస వంటి వ‌రుస ప్లాప్‌ల‌ను మూట కొట్టుకొని సతమతమవుతున్న సమయంలో ఎన్టీఆర్ వద్దకు రెండు కథ‌లు వచ్చాయి.. అందులో శ్రీమంతుడు ఒకటి కాగా మరొకటి టెంపర్‌. ఇక టెంపర్ క‌థ‌ కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో ఎన్టీఆర్ దానిని ఓకే చేశాడు శ్రీమంతుడును సున్నితంగా రిజెక్ట్ చేశాడు. అలా ఎన్టీఆర్ నుంచి శ్రీమంతుడు కథ‌ మహేష్ వద్దకు వచ్చి ఆయన కెరీర్ లోనే ఓ గొప్ప సినిమాగా మిగిలిపోయింది.