ఆ కారణంతోనే ఉదయ్ కిరణ్ చిరంజీవికి అల్లుడు అవ్వలేకపోయాడా..!

చిత్ర పరిశ్రమకు చాలామంది నటులు తమ తొలి సినిమాతోనే తమలో ఉన్న టాలెంట్ బయటపెట్టి స్టార్ హీరోలుగా ఎదుగుతారు. అలాంటి వారిలో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకడు. చిత్రం మూవీతో ఎంట్రీ ఇచ్చి.. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత వరుసుగా నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.. అలా ఇండస్ట్రీకి పరిచయం అవటంతోనే వరుసగా మూడు సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు ఉదయ్ కిరణ్.

దాంతో చాలామంది అగ్ర దర్శకులు, నిర్మాతలు ఉదయ్ కిరణ్‌తో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ ఎదుగుదలను చూసి ఎప్పటికైనా స్టార్ హీరో అవుతాడనే ఉద్దేశంతో తన పెద్ద కూతురు సుష్మితని ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఇదే విషయాన్ని ఉదయ్ కిరణ్ కి చెప్పటంతో ఆయన కూడా ఒప్పుకున్నాడట. వీరి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది.

ఎప్పుడైతే వీరి పెళ్లి గురించి చిత్ర పరిశ్రమలో వార్తలు బయటికి వచ్చాయో అప్పటినుంచి సుష్మిత- ఉదయ్ కిరణ్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పార్టీల‌కు, వెకేషన్స్ అంటూ తిరగటం మొదలుపెట్టార‌న్న టాక్ అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలా పెళ్లికి ముందే ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారట. కానీ ఎంగేజ్మెంట్ కు కొన్ని రోజులు ముందు కొంతమంది మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్లు సుష్మిత గురించి ఉదయ్ కిరణ్ కి తప్పుడు విషయాలు చేరవేశారట.

ఇది స‌హ‌జంగానే ఇద్ద‌రి మ‌ధ్య స్ప‌ర్థ‌ల‌కు కార‌ణ‌మైంది. దీంతో సుష్మిత‌కు ఉద‌య్ కిర‌ణ్ మీద కోపం రావ‌డం.. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య స‌రైన వాతావ‌ర‌ణం లేక‌పోవడంతో పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు. చిరంజీవి ఉద‌య్‌కు స‌ర్ది చెప్పేందుకు ట్రై చేసినా ఉద‌య్ విన‌క‌పోవ‌డం కూడా ఉద‌య్‌పై చిరు కోపానికి కార‌ణ‌మైంద‌ని అంటారు.