నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులకు రెండు సూపర్ అప్డేట్స్ వచ్చేసాయి. ఒక వారంలో అటు బాలయ్య నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటు.. ఇటు భారీ అంచనాలన్న మరో సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా బాలయ్య ముఖ్య అతిథిగా వస్తున్నారు. రామ్ పోతినేని – శ్రీలీల కలయికలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీస్ స్కంధ. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళినప్పటి నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతో పాటు రెండు సాంగులు అందరిని ఆకట్టుకుని సినిమాపై మరింత హైప్ పెంచేసాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈనెల 26న స్కంధ ట్రైలర్ ఫ్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాకు నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేశారు. ఇక స్కంధ సినిమా సెప్టెంబర్ 15న పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక బాలయ్య నటిస్తోన్న భగవంత్ కేసరి సినిమా ఫస్ట్ సాంగ్‌ను సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న భారీగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.