మెగా హీరో వరుణ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు ముకుందా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. తర్వాత ప్రయోగాత్మక సినిమా కంచెతో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో విజయం సాధించలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డు కూడా వచ్చింది .
ఇక సినిమా దగ్గరనుంచి వరుణ్ తన కెరీర్ లో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం గాండీవ దారి అర్జున అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆగస్టు 25 అనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమాల వరుణ్ కు జంటగా సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు వరుణ్ గత చిత్రం గని ఘోరంగా ప్లాఫ్ అవడంతో ఈ సినిమాను చాలా కసిగా చేశాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీవ్యూస్ పలు దేశాల్లో పడడంతో టాక్ బయటికి వచ్చింది అసలు సినిమా ఎలా ఉంది.. ఈ సినిమా కథ తెలుగు వారిని ఏమేరకు ఆకట్టుకోనుంది.. నటీ నటుల ఫెర్ఫామెన్స్ ఎలా ఉంది.. వంటి అంశాలు ఇక్కడ చూద్దాం.. ముందుగా ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ సినిమాలకు స్పెషలిస్ట్.. గతంలో సినియార్ హీరో రాజశేఖర్‌తో ఆయన తెరకెక్కించిన గరుడవేగ సినిమా చూసి టాలీవుడ్ ఒకసారిగా షాక్ అయింది. ఇప్పుడు ఇదే స్టైల్ లో వరుణ్ తేజ్ హీరోగా గాండీవధారి అర్జున సినిమా వచ్చింది.
ఈ సినిమా మీద రిలీజ్‌కు ముందు అంచనాలు బానే ఉన్నాయి. ఈరోజు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాపై ప్రీమియర్ షో రిపోర్ట్ అయితే బయటికి వచ్చాయి. ఈ సినిమా ప్రయత్నం అయితే బాగానే ఉంది కానీ.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందని కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమా కథ బాగున్నప్పటికీ దర్శకుడుప్రేక్షకులకు అధ్యమయ్యే రీతిలో చూపించడంలో విఫలమయ్యారని మరికొందరు సినిమా చూసి సోషల్ మీడియాలో కామెంట్ లో పెడుతున్నారు.. మరికొందరు చెత్త సినిమా ఎందుకు తీసారు రా బాబు ట్విట్టర్లో బాగా టాక్ నడుస్తుంది.
ఈ సినిమాలో వచ్చే ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ మెసేజ్ బాగుంది. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అయితే సినిమా ఫస్ట్ అఫ్ చాలా స్లోగా సాగిందని నెటిజన్లు ట్వెటర్ రివ్యూలో చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ సినిమా మీది నెగటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా పూర్తి రివ్యూ వస్తే గాని ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది అర్థం కాదు.