NTR : పోటీ పడి మరి ఎన్టీఆర్ ని పొగుడుతున్న ముద్దుగుమ్మలు..!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ (NTR) ని కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీస్ కూడా ఇష్టపడతారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి హీరోయిన్స్ అంతా చాలా బాగా చెబుతుంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఎన్టీఆర్ గురించి ఓ ఇద్దరు హీరోయిన్స్ పోటీ పడి మరి చెబుతున్నారు. ఇంతకీ వారిద్దరు ఎవరు అంటే ఒకరు నివేదా థామస్, ఇంకొకరు రెజినా కసాండ్ర.

నివేదా థామస్ ఆల్రెడీ ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమాలో ఆయనతో కలిసి నటించింది. ఆ సినిమా టైం లో NTR ఇచ్చిన ప్రోత్సాహం.. ఆయన టాలెంట్ ప్రత్యేక్షంగా చూసి ఇంప్రెస్ అయినట్టు చెప్పింది. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. తోటి నటులకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా మంచి మనిషని అన్నారు నివేదా థామస్. ఆయనతో మళ్లీ నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు నివేదా.

ఇక రెజినా కూడా ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని. ఆయనతో ఇప్పటివరకు కలిసి నటించే ఛాన్స్ రాలేదని వస్తే తప్పకుండా చేస్తానని అన్నది. అంతేకాదు నటనలో ఆయన్ని మరో కమల్ హాసన్ అనేసింది రెజినా. ఆయన గురించి చాలామంది చాలా సందర్భాల్లో బాగా చెప్పారని. ప్రాత్యక్షంగా చాలా తక్కువసార్లు కలిశాను కానీ ఎన్టీఆర్ ఎప్పటికీ సూపర్ అనేసింది రెజినా. సడెన్ గా ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎన్టీఆర్ పై ఇలా చెప్పడం ఏంటని ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు.

Tags: Niveda Thomas, ntr, NTR movies, Regina, Shakini Dhakini, Tollywood