Samantha : యశోద టీజర్.. పాపం సమంతకి ఎన్ని కష్టాలు వచ్చాయి..!

సమంత (Samantha) హీరోయిన్ గా ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వస్తున్న సినిమా యశోద. హరి హరీష్ ఇద్దరు దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజైంది. ఈ టీజ లో సమంత ప్రెగ్నెసీ తర్వాత ఏదైతే చేయకూడదు అని డాక్టర్ చెబుతుందో అవే చేస్తుంది. ఇంతకీ సమంతకు వచ్చిన కష్టం ఏంటి ఆమె ఎందుకు సమస్యల్లో పడ్డది అన్నది సినిమాలో చూడాల్సిందే.

యశోద సినిమాలో Samantha మరోసారి తన నట విశ్వరూపం చూపించినట్టు తెలుస్తుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ హైలెట్ అవబోతుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సమంత తన సత్తా చాటుతుంది. యశోద టీజర్ ఇంప్రెస్ చేసింది. తప్పకుండా సమంతకి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చేలా ఉంది.

ఇక ఈ మూవీతో పాటుగా గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. సమంత ఈ రెండు సినిమాలతో పాటుగా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తుంది.

 

Tags: Samantha, Samantha News, Samantha Updates, Samantha Yashoda, yashoda, Yashoda Teaser