నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ జీవితంలో రెండు పెద్ద విషాదాలు.. ఆమె భ‌ర్త ఎవ‌రో తెలుసా…!

సినిమా ఇండస్ట్రీలో నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని అబ్బాయిలు హీరోలుగా రాణిస్తున్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి వారిలో ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ అయింది. 25 ఏళ్ల క్రితం నాగర్జున మేనకోడలు ఏఎన్ఆర్ మనవరాలు, యార్లగడ్డ సుప్రియ కూడా హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో సుప్రియ హీరోయిన్‌గా నటించింది. ఆ ఒక్క సినిమాతోనే ఆమె అడ్రస్ లేకుండా పోయింది.

 

Supriya Yarlagadda Wiki, Husband, Age, Biography, Net worth & Profile

మళ్లీ 20 సంవత్సరాల గ్యాస్ తర్వాత గూఢ‌చారి సినిమాతో ఆమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కారణం ఏదైనా సుప్రియతో పాటు సుప్రియ సోదరుడు యార్లగడ్డ సుమంత్ ఇద్దరి జీవితాలు వ్యక్తిగతంగా సవ్యంగా సాగలేదు. సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకొని ఏడాదికే విడాకులు ఇచ్చేశాడు. ఇప్పటికీ సుమంత్ ఒంటరిగానే ఉంటున్నాడు. అటు సుప్రియ ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 

రామోజీరావు నిర్మించిన ఇష్టం సినిమాతో టాప్ హీరోయిన్ శ్రేయ వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించింది. చరణ్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం లో జన్మించారు. అప్పట్లో రామోజీరావు కొత్త హీరోలకు అవకాశాలు ఇస్తున్న టైంలో ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా చరణ్ కొన్ని సినిమాలలో నటించాడు. ఈ క్రమంలోనే సుప్రియ‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

 

పెళ్లి జరిగిన కొద్ది నెలల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే చరణ్ రెడ్డి మ‌ద్యానికి బానిస కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అలా మద్యం తాగి తాగి
తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే చరణ్ అలా మారటం వెనక సుప్రియ తప్పు కూడా ఉందని.. ఆమె టార్చర్ చేయడం వల్లే చరణ్ మద్యానికి బానిస అయ్యాడని అంటారు.

Tollywood Supporting Actress Supriya Yarlagadda Biography, News, Photos, Videos | NETTV4U

 

ఇక సుప్రియ భర్తను కోల్పోవడమే కాదు.. చిన్నప్పుడే తల్లిని కూడా కోల్పోయింది. దీంతో ఆమెను సుమంత్‌ను ఏఎన్ఆర్ దగ్గరుండి మరి పెంచడం విశేషం. అయితే సుప్రియ ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్‌తో ప్రేమలో ఉందన్న పుకార్లు గత రెండు సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి. మరి వీరి ప్రేమాయణం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Tags: akkineni nagarjuna, film news, filmy updates, heroin, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, supriya, telugu news, Tollywood, trendy news, viral news