టాలీవుడ్‌ను ఏలేస్తోన్న ఈ టాప్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

కొంద‌రు బాల‌న‌టులుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద‌య్యాక కూడా స్టార్లు అవుతారు. పై ఫొటోలో క‌నిపిస్తోన్న పాప కూడా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్‌. తన చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు మన నిత్యామీనన్. టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో చాలా సినిమాల్లో నటించి అందరి అభిమానాన్ని పొందింది.

Nithya Menon Age - Height, Family, Net Worth, Boyfriend

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక రేటింగ్ పొందిన హీరోయిన్లలో నిత్యమీనన్ ఒకరు. ఆమె కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేసే టైప్‌ కాదు.. ఆమె సహజంగా ఆ పాత్రలో జీవించగలను అనుకుంటేనే ఆ పాత్రలో నటించేది. అలా ఏ సినిమా చేసినా సరే నాచురల్ పెర్పామెన్స్‌తో ప్రేక్ష‌కుల మైండ్ బ్లోయింగ్ చేసేది.

టాలీవుడ్ లో అలా మొదలైంది, ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భీమ్లా నాయక్, ఓకే బంగారం లాంటి సినిమాల్లో ఈమె నటించింది. ఇటీవ‌ల‌ వండర్ ఉమెన్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది నిత్య. ఆమె సోలోగా యాక్ట్ చేసిన ప్రాణ, బాలీవుడ్ లో.. మిషన్ మంగల్ హిట్ అయ్యాయి. ఆమె యాక్టింగ్ కు చాలా అవార్డులు కూడా వచ్చాయి. 2022లో తమిళంలో రిలీజ్ అయిన తిరుచిత్రంబళంలో నిత్య ప్రధాన పాత్ర వహించింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాగా… ఇందులో ధనుష్ హీరోగా నటించారు. నిత్యామీనన్ తనకు చిన్ననాటి స్నేహితురాలిగా ఉంటూ ప్రేమికురాలిగా మారిన పాత్రలో నటించి. అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా రు. 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్ల‌గొట్టింది. ప్రస్తుతం నిత్యామీనన్ ఆరం తిరుకల్పన లో నటిస్తోంది. దీని తరువాత అంజని మీనన్ సినిమాలో న‌టిస్తోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, star heroin, Star Heroine, telugu news, Tollywood, top actrress, trendy news, viral news