Pawan Kalyan : పవర్ స్టార్ బర్త్ డే అంటే ఇంతే మరి..షేకయి పోతున్న ట్విట్టర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ షేక్ అయిపోతోంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రెండు మూడు రోజులుగా ఆయన ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా వేదిక ఏదైనా పవన్ కళ్యాణ్ మేనియా కనిపిస్తోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్, తమన్, రామజోగయ్య శాస్త్రి, శ్రీను వైట్ల, మంచు విష్ణు, రామ్ తాళ్లూరి, కోన వెంకట్, మెహర్ రమేష్, వెన్నెల కిషోర్, నవదీప్, రఘురామకృష్ణరాజు, సోము వీర్రాజు, సునీల్ దియోధర్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇక పవన్ వీరాభిమాని అయిన నిర్మాత బండ్ల గణేష్ తనదైన స్టైల్లో తన దేవుడికి శుభాకాంక్షలు తెలిపాడు.

‘ ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, పవన్ ఈశ్వరుడు ఒక్కడే. మా దేవరకు జన్మదిన శుభాకాంక్షలు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. మరోవైపు ట్విట్టర్లో హ్యాపీ బర్త్డే జనసేనాని పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ లైన్ టాప్ ఒన్ లో ట్రెండ్ అవుతోంది. కాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా క్రిష్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు స్పెషల్ గ్లాన్స్ ఇవాళ సాయంత్రం 5.45 గంటలకు విడుదల కానుంది.

Tags: bandla ganesh, manchu manoj, Pawan kalyan, pawan kalyan bday, sai dharm tej, ss tamman, tollywood gossips, tollywood heros