లైగర్ సినిమా వల్ల విజయ్ దేవరకొండ కేవలం ఫెయిల్యూర్ భారాన్నే కాకుండా మరింత ఇబ్బంది ఫేజ్ చేయాల్సి వస్తుంది. పూరీ మీద ఉన్న నమ్మకంతో లైగర్ ఇండియాని షేక్ చేస్తుందని ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో మాట్లాడిన విజయ్ దేవరకొండ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో సైలెంట్ అయ్యాడు. అయితే విజయ్ ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు అతన్ని టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా నచ్చితే చూడండి లేదంటే లేదని అనడం పెద్ద తప్పు.
లైగర్ సినిమా విషయంపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ (Tammareddy) కూడా లేటెస్ట్ గా కామెంట్ చేశారు. ఆడియెన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి.. సినిమా చూస్తే చూడండి లేదంటే లేదని అంటే వాళ్లు తిప్పికొడతారు. అందుకే ఎగిరెగిరి పడొద్దు అని అన్నారు తమ్మారెడ్డి. ఇక్కడ కేవలం విజయ్ ని ఉద్దేశించి అనడం కాదు కానీ సినిమా ప్రమోషన్స్ లో అంచనాలు పెంచేసి తీరా సినిమా చూసే సరికి నిరుత్సాపడటం ఆడియెన్స్ వంతు అవుతుంది.
అందుకే వాస్తవాలు మాట్లాడాలని ఆయన అంటున్నారు. ఇక పూరీ మీద తనకు మంచి ఒపీనియన్ ఉందని. అతని సినిమాలు చాలా ఇష్టమన్న తమ్మారెడ్డి (Tammareddy) లైగర్ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని అనిపించలేదని అన్నారు.