Pawan Kalyan : కర్నూలులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ ధ్వంసం చేసిన అభిమానులు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్భంగా జల్సా సినిమా రీ రిలీజ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ బర్త్ డే మరింత స్పెషల్ గా జరుపుకోవాలని జల్సా సినిమాని 4కె ప్రింట్ రీ రిలీజ్ చేశారు. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ జల్సా రీ రిలీజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సినిమా రీ రిలీజ్ హంగామా బాగానే ఉన్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ గొడవలకు దిగడం హాట్ న్యూస్ గా మారింది.

కర్నూలులో ఓ థియేటర్ ని కూడా వారు ధ్వసం చేశారు. కర్నూలులోని శ్రీ రామ థియేటర్ లో జల్సా సినిమా రీ రిలీజ్ చేశారు. ఒక షో పడిన వెంటనే రెండో షో కూడా ఫ్యాన్స్ కోరారు. అయితే రెండో షో టైం లో థియేటర్ లో స్పీకర్ ప్రాబ్లంస్ వచ్చాయి. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి.. థియేటర్ సిబ్బందికి గొడవ జరిగి ఆగ్రహంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ లో అద్దాలను పగలగొట్టారు.

థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫాం చేయగా వెంటనే వారు థియేటర్ దగ్గరకు వచ్చి అల్లరి చేస్తున్న కొందరు యాన్స్ బైకులను స్టేషన్ కి తరలించారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ రచ్చ అందరికి తెలిసిందే. అయితే ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడం వల్లే గొడవ చేశామని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

Tags: Pawan kalyan, Pawan Kalyan Fans, Powerstar Pawan Kalyan, Srirama, Srirama Theatre, Tollywood