అత్తింటి వేధింపులు భరించలేక భార్యలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవడం.. కేసు నమోదు చేసి దర్యాప్తులు చేయడం మనం సర్వసాధారణంగా ఎప్పుడు వింటూనే ఉంటాం. కాని తాజాగా ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన భార్య, అత్తింటి వారి వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ అది కూడా అబ్బాయి.. భార్య వేధింపులు భరించలేక కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. ఎస్ ఇది నిజం.
తెలంగాణ కేడర్ లో ఐఏఎస్ అఫీసర్‌గా పనిచేస్తున్న బిహార్‌వాసి సందీప్ కుమార్ ఝా తనపై తప్పుడు కేసులు పెట్టి పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 2021 నవంబర్ 21న పల్లవి ఝాను వివాహం చేసుకున్న సందీప్ పెళ్లి తర్వాత బంజారాహిల్స్ లోని తన ఇంట్లో 25 రోజులు మాత్రమే కాపురం చేసిన ఆమె అతనితో పాటు కుటుంబ సభ్యులను కూడా తరచూ వేధించేదని ఎప్పుడు గొడవ పడుతూ ఉండేదని.. అంతేకాక ఆమె సోదరుడు మా ఇంట్లో రూ.25 వేలు దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు సందీప్.
ఆ తర్వాత పల్లవి ఝా తండ్రి ప్రమోద్‌ఝా సోదరుడు పంజాల్‌ఝా ముగ్గురు తనను వేధిస్తున్నారని తప్పుడు ఆరోపణలతో బీహార్‌లో తప్పుడు కేసులు నమోదు చేయించారని అంతటితో ఆగకుండా నా సొంత ఊరిలో ఉన్న ఇంటి పై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరిచి అంతు చూస్తానని బెదిరించారు అంటూ కేసులో పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించాడు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు మేరకు ఎంక్వయిరీ మొదలుపెట్టారు.