చిరుకి ప్ర‌పోజ్ చేసిన శ్రీముఖి ఏం చేసిందో చూడండి… సిగ్గుప‌డిపోయిన మెగాస్టార్‌..!

మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేష్ కీరోల్ ప్లే చేసిన సినిమా ‘ బోళా శంకర్ ‘. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జ‌రిగింది. ఈవెంట్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ డైరెక్టర్లు ఎంతో మంది హాజరయ్యారు. బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి కూడా ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది.

హైపర్ ఆది స్పీచ్ హైలెట్గా నిలిచింది. మెగా ఫ్యామిలీ పై ప్రశంసలు కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్న హైపర్ ఆది బోళాశంకర్ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ టీంకు విష్ చేశాడు. శ్రీముఖి బోళా శంకర్ సినిమాలో కీరోల్‌ ప్లే చేస్తుంది. ఆమెది కాస్త బోల్డ్ క్యారెక్టర్ అని ట్రైలర్ చూసిన వారికి అర్థమవుతుంది. ట్రైలర్‌తో శ్రీముఖి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరుతో ఆమెకి మంచి కాంబినేషన్స్ ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక బ్లాక్ చుడీదార్ తో న్యూ లుక్‌లో అందాన్ని ఆరబోసిన శ్రీముఖి స్టేజిపై మాట్లాడుతూ బోళాజీ ఐ లవ్ యూ అంటూ చిరంజీవికి ప్రపోజ్ చేసింది. ఆ మాట విన్న చిరంజీవి తెగ సిగ్గుపడ్డాడు.

అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం అనేది ఒక అదృష్టమని.. ఆ అదృష్టం నాకు వరించింది.. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెహర్ రమేష్ కు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ తో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని మాట్లాడిన శ్రీముఖి 4జీ, 5జీ అంటే అందరికీ తెలుసు కానీ నాకు తెలిసిన జీమాత్రం బోళాజీ అంటూ డైలాగ్‌ల‌ వర్షం కురిపించింది. దీంతో శ్రీముఖి స్పీచ్ ఈవెంట్లో అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవికి నేను ఒక అభిమానిని చెప్పుకొచ్చింది. శ్రీముఖి గ్లామర్ ఫోటోలు తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఇక భోల శంకర్ మూవీ ఈనెల 11న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.