Today Episode: నిన్నటి ఎపిసోడ్లో రిషి ని చంపడానికి శైలేంద్ర నియమించిన రౌడీ స్కెచ్ వేయడం మనం చూశాం. వారి ప్లాన్ తెలుసుకున్న వసుధార పాండ్యన్ బ్యాచ్ హెల్ప్‌తో రిషిని కాపాడుతుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్ లో… వసుధార తనపై పెతనం చేయడం రిషి సహించలేక పోతాడు. ఆమెకు క్లాస్ పీకుతాడు మన గతం బయట పెట్టవద్దని వార్నింగ్ ఇస్తాడు. అతడు మాటలు వసుధార పట్టించుకోదు. మీరే నా ప్రాణం, మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాను అనే రిషితో అంటుంది వసుధార. ఆమెని కలిసిన రిషి కార్లో ఇంటికి బయలుదేరుతాడు.
అతడిని శైలేంద్ర నియమించిన రౌడీలు ఫాలో అవడం వసుధార చూసి మళ్లీ రిషి పై ఏదో ఎటాక్ జరగబోతుందని కంగారుపడుతుంది. ఆ రౌడీలను వసుధార ఫాలో అవుతుంది. మధ్యలో రౌడీల వాహనం మిస్ అవుతుంది. వాళ్ళు ఏమయ్యారు వసుధారకి అర్థం కాదు. మరోపక్క ఆ రౌడీ గ్యాంగ్ లీడర్ శైలేంద్రకు ఫోన్ చేస్తాడు. రిషిని వేసేయడం పక్క అని చెప్తుండగా.. శైలేంద్ర ఈసారి రిషి ఎస్కేప్ అయ్యాడని కాకుండా చంపేసాడు అనే గుడ్ న్యూస్ చెప్పకపోతే ఊరుకునని హెచ్చరిస్తాడు. అతని కాపాడడానికి చాలామంది ఎదురుచూస్తున్నారని జాగ్రత్తగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని వివరిస్తాడు.
ఒక అమ్మాయి ద్వారా రిషి ని ట్రాప్ చేయాలని ఫిక్స్ అవుతారు రౌడీలు. ప్రెగ్నెంట్గా నాటకం ఆడుతూ రోడ్డు పక్కన లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ మహిళ నాటకం మొదలు పెడుతుంది. ఆమె ఆపదలో ఉందని రిషి కారు ఆపుతాడు. అతడు కారు నుంచి దిగిగానే రిషి పై అటాక్ చేస్తారు రౌడీలు. గతంలో రిషి పై అటాక్ చేసినవాళ్లు వీళ్ళని రిషికే అర్థమవుతుంది. రిషి ని అందరూ లాక్ చేశారు. ఓ రౌడీ కత్తితో పొడవుతుండగా సడన్గా అక్కడికి పాండియన్ బ్యాచ్ వచ్చి రౌడీ గ్యాంగ్‌ని చితకొట్టి రిషి ని కాపాడుతారు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని రిషి పాండ్యన్‌ని అడుగుతాడు.
వసుధార ఫోన్ చేసి రౌడీలు ఫాలో అవుతున్న సంగతిని చెప్పి మీ లొకేషన్ షేర్ చేసిందని చెబుతాడు పాండ్యన్. రిషి రౌడీల గ్యాంగ్ పారిపోవడంతో పాండ్యన్ బ్యాచ్‌ని మీరు వెళ్లిపోండి అని చెప్తాడు.. మేము ఇంటి దాకా మిమ్మల్ని దించుతాము అని చెప్తే రిషి దానికి ఒప్పుకోడు. మరోపక్క జగతికి రిషి ఏదో ప్రమాదంలో ఉన్నట్టు కల వస్తుంది. రిషి అంటూ బెంగతో నిద్రలేచి కంటనీరు పెట్టుకుంటుంది. వెంటనే మహేంద్ర లేచి ఏమైంది జగతి అని అడగగా.. రిషి ఏదో ప్రమాదంలో ఉన్నాడు అంటూ బాధపడుతుంది. మహేంద్ర వసుధారకు ఫోన్ చేసి రిషిని ఒకసారి వీడియో కాల్ లో చూపించమని అడుగుతాడు.
రిషికేం కాలేదు క్షేమంగా ఉన్నాడు అంటూ రిషి ని మహేంద్ర, జగతిలకు చూపిస్తుంది. జగతి అయినా కూల్ అవ్వకుండా బాధపడుతూ నేను ఇప్పుడు స్వయంగా రిషి ని చూడాలి అని అడుగుతుంది. మహేంద్ర దానికి ఒప్పుకోడు. ఇప్పుడు మనం వెళ్తే రిషి ఫీల్ అవుతాడు. ఏంజెల్, విశ్వనాధాన్‌కి డౌట్ వస్తుంది అని అడ్డుపడతాడు. మరోపక్క రిషి ఫైటింగ్ ప్లేస్‌లో రిషి పై అటాక్ చేసే టైంలో రౌడీ గ్యాంగ్ లీడర్ ఫోన్ కింద పడిపోతుంది. శైలేంద్ర అతనికి ఫోన్ చేస్తాడు. రిషి కాల్ లిఫ్ట్ చేసే లోపు ఫోన్ కట్ అయిపోతుంది. ఎవరి ఫోన్ చేశారా అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో వసుధార అటుగా వెళుతూ రిషి కంటపడుతుంది. ఏంటి మేడం ఇక్కడ ఏం చేస్తున్నారు అని వసుధారని అడుగుతాడు రిషి. ఇంటికి వెళ్తున్నానని ఆము రిషికి సమాధానం ఇస్తుంది. చీకట్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావా అని ప్రశ్నిస్తాడు. వసుధార నాకేం భయం లేదు అని చెప్తుంది. ఆడపిల్లను ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం ఉండదు ఇంటి దగ్గరకు నేను దింపుతాను అని రిషి చెప్తాడు. చీకట్లో ఒంటరిగా మీరు బయటకు రావడం ఎందుకు మేడం అని వసుధార అడుగుతాడు రిషి. మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంతో వచ్చానని వసుధారా అంటుంది.
మీరు చేసిన గాయం కంటే ఇదేమి పెద్దది కాదు లెండి అని వసుధార మాటలతో బాధపడతాడు రిషి. వసుధార కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న సరే వినిపించుకోకుండా నన్ను నేను కాపాడుకోగలను నా చుట్టూ ఉండే నన్ను ప్రమాదంలో నెట్టేశారు ఒకప్పుడు అంటూ వసుధార మనసును బాధ పెడతాడు. ఇల్లు రావడంతో వసుధార కారులో నుంచి దిగుతూ రిషిని కాఫీకి ఇన్వైట్ చేస్తుంది రిషి. ఎంత రిక్వెస్ట్ చేసిన మనమధ్య అంత ఫ్రెండ్షిప్ లేదంటూ ఆమె ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. నన్ను మళ్ళీ కాపాడినందుకు థాంక్స్ అంటూ రిషి చెబుతాడు.
గతంలో మిమ్మల్ని కాపాడానని వసుధార అంటుంది. గతంలో కాపాడలేదని మానసికంగా చంపేశారని అక్కడి నుంచి వసుధార పిలుస్తున్న పట్టించుకోకుండా రిషి వెళ్ళిపోతాడు. అతడు మాటలతో వసుధార హట్ అవుతుంది. రిషికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు నా తప్పు జరిగిందని ఒప్పుకొని సహనంగా మౌనంగా ఉంటున్నాను.. రిషి మంచి కోసమే ఆరాటపడుతున్న.. అతనికి నా గురించి అర్థం కావడం లేదు అంటూ తండ్రితో చెప్పి బాధపడుతుంది వసుధార. అక్కడితో ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది