ఎన్టీఆర్ గడ్డంపై చర్చ.. ‘బ్రహ్మాస్త్ర’ కోసం ఎలా వస్తారో..

జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయాడు.. ఎన్టీఆర్ ఇండియాలోనే కాదు హాలివుడ్ లోనూ అభిమానం సంపాదించుకున్నారు. ఆయన నటనకు హాలివుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ నటన చూసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఈ భేటీ ఎన్నో చర్చలకు దారి తీసింది. రాజకీయ చర్చ ఒకవైపు అయితే.. ఎన్టీఆర్ గుబురు గడ్డంపై కొత్త చర్చ మొదలైంది.

ఇక బాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘బ్రహ్మస్త్ర’.. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తారక్ హాజరు కాబోతున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. కొందరు మాత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నారు అనే దానిపై చర్చించుకున్నారు. ఎన్టీఆర్ లుక్ ఎగురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ గడ్డంపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతూ ఉంది.. రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలు వస్తున్న సినిమా కోసం గడ్డం పెంచినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. మరో రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఆయన ఇలాగే గడ్డం పెంచుకుంటూ ఉంటా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆయన గడ్డం పెంచుకుంటూపోతే యోగిలా మారిపోతాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బ్రహ్మస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ గడ్డం, ఆయన ఫిజిక్ పై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Tags: amithsha, goes viral, latest news, ntr, Photoshop, social media