చిరంజీవికి 30 ఏళ్లగా డూప్.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఓ పేరు కాదు.. ఒక బ్రాండ్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ అయ్యారు. మాస్ యాక్షన్, కామెడీ, అదిరిపోయే డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. 150 సినిమాలకు పైగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 67 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నారు.

ఇక చిరంజీవి చేసే రియల్ స్టంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి కష్టమైన స్టంట్ చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు.. అయితే ఇప్పుడు వయసు రీత్యా ఆయన స్టంట్స్ విషయంలో రిస్క్ తీసుకోవడం లేదని చెప్పాలి.. ఇక పోతే చిరంజీవికి 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తి డూప్ గా నటిస్తున్నాడు..

సాధారణంగా హీరో, హీరోయిన్లకు డూప్స్ ఉంటారు. దర్శక నిర్మాతలు కొన్ని షాట్స్ ను డూప్స్ లతో చేయిస్తుంటారు.. ఎందుకంటే రిస్కీ షాట్స్ చేయడానికి కొంతమంది హీరోలు ముందుకురారు. అందుకే డూప్స్ తో ఆ సీన్స్ చిత్రీకరిస్తారు. అప్పట్లో డూప్స్ ఎవరు చేశారో ప్రేక్షకులకు తెలిసేది కాదు. కానీ ఈకాంలో సోషల్ మీడియా ద్వారా డూప్ గురించి తెలుస్తోంది..

ఇక కొన్ని ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ వారిని లైవ్ లోకి తీసుకొస్తుండటంతో డూప్ లకు ఆదరణ లభిస్తోంది. ఇటీవల ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడి టాలెంట్ ని బయటకు తీస్తున్నారు. ఈక్రమంలో చిరంజీవికి 30 సంవత్సరాలుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి గురించి బయటపడింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్టూర్ కి చెందిన ప్రేమ్ కుమార్ గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి డూప్ గా వ్యవహరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. చిరంజీవికి డూప్ గా చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రేమ్ కుమార్ చెప్పారు..

Tags: 30 years, actress, chiranjeevi, comments, dup, movies, Tollywood