రానా త‌మ్ముడు అభిరాయ్ యాక్టింగ్‌పై అప్పుడే ట్రోలింగ్‌… ఎక్స్‌ప్రెష‌న్స్‌కు దండం పెట్టేస్తున్నారా..!

ఎలాంటి హీరోల‌తోనైనా సినిమాలు చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు తేజ‌.. ఎందరో కొత్త నటీనటులను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన తేజ వారి ద‌గ్గ‌ర నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయినా రాబట్టగలడనే ఇమేజ్ కూడా తేజ‌కు ఉంది. అదే స‌మ‌యంలో అవ‌స‌ర‌మైతే వారిని కొడ‌తాడానే పేరు కూడా తేజ‌కు ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి ద‌ర్శ‌కుడికే కొరకరాని కొయ్యగా మారాడట దగ్గుబాటి అభిరామ్.

Announcement Poster : Ahimsa First Look ( Abhiram Daggubati )

టాలీవుడ్ బడా ఫ్యామిలీలలో దగ్గుబాటి కుటుంబం కూడా ఒకటి. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే వెంకటేష్, రానా టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్లోకి రాబోతున్నాడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్. అహింస‌ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న తేజకు మాత్రం అభిరామ్ త‌న న‌ట‌న‌తో చుక్క‌లు చూపించేస్తున్నాడ‌ట‌.

Director Teja's Ahimsa Movie Impressive New HD Posters - Social News XYZ

ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి కావడం మరో విశేషం. అభిరామ్ కన్నా హీరోయిన్ నే ఈ సినిమాలో చక్కగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అభిరామ్‌ మాత్రం షూటింగ్ సమయంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా మొద్దబ్బాయి లాగా సినిమా చేస్తున్నాడట. దర్శకుడు తేజ చాలా రోజులు ప్రయత్నించినా అభిరామ్ దగ్గర నుంచి స‌రైన న‌ట‌న రాబట్టలేకపోయాడట.

Abhiram Ahimsa trailer review | cinejosh.com

దీంతో చేసేది ఏమీ లేక తన సీనియారిటీ అంతా ఉపయోగించి ఈ సినిమా క్లైమాక్స్ తేజ‌ కోసం ఓ కొత్త ఆలోచన చేశాడ‌ట‌. హీరో కనిపించకుండా క్లైమాక్స్ ఫైట్ షూట్ చేశారట తేజ. అవును అహింస క్లైమాక్స్ ఫైట్ లో హీరో కనిపించడ‌ట. కానీ హీరోనే ఫైట్ చేసిన ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుందట. ఏదో విధంగా ఈ సినిమా నుంచి త్వరగా బయటపడాలని తేజ భావిస్తున్నాడట. మరి అభిరామ్ రాబోయే రోజుల్లో మిగతా దర్శకులను ఏ విధంగా తన ఎక్స్ప్రెషన్ల‌తో ఆడుకుంటాడో చూడాలి. జూన్ 2న అహింస రిలీజ్ అవుతోంది.