అట్ట‌ర్‌ప్లాప్ ‘ ఏజెంట్‌ ‘ కు మ‌రో ఘోర అవ‌మానం…!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ఏజెంట్. భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయిన ఏజెంట్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బాల్చి త‌న్నేసింది. దాదాపుగా రూ.80 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన ఏజెంట్ చివ‌ర‌కు రు. 10 కోట్లు కూడా రాబ‌ట్ట‌లేదు. అఖిల్ కొన్న వాళ్లంద‌రూ దారుణంగా న‌ష్ట‌పోయారు. అఖిల్ తొలి సినిమా అఖిల్‌ను మించిన డిజాస్ట‌ర్ అయ్యింది ఈ ఏజెంట్‌. ఇక ఏజెంట్‌ను వాస్త‌వంగా ఈ రోజే స్ట్రీమింగ్ చేసేయాల‌ని డిసైడ్ అయ్యారు.

Agent 6 Days Collections: A shocking shock for Akhil.. Is it so bad in 6 days? | Akhil Starrer Agent Movie 6 Days Worldwide Official Collections

ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సోనీ లివ్ కొనుగోలు చేయడం జరిగింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా ఎలాగూ డిజాస్ట‌ర్‌. క‌నీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే కొంద‌రు అయినా చూస్తార‌ని అనుకున్నారు. అందుకే అంత త్వ‌ర‌గా ఓటీటీకి ఇచ్చేశారు. అయితే ఈ రోజు ఏజెంట్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయ‌లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగిందో తెలియ‌క చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Akhil Agent Movie Heroine Latest News in Telugu, Akhil Agent Movie Heroine Top Headline, Photos, Videos Online | TV9 Telugu

సినిమా చాలా మంది ఎలాగూ డిజాస్ట‌ర్ అయ్యింద‌ని.. థియేట‌ర్ల‌లో చూడ‌లేదు. క‌నీసం ఓటీటీలో అయినా చూడాల‌ని ఆశ‌ప‌డ్డారు. ఇప్పుడు సోనీ లివ్‌ను వారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఈ నెల 26 నుంచి ఏజెంట్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. క‌నీసం బుల్లితెర మీద కూడా ఏజెంట్‌కు అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. డేట్ ప్ర‌క‌టించాక కూడా సోనీ లివ్ వాళ్లు వెన‌క్కు త‌గ్గారు.